‘కల్ట్’ టీజర్ అప్డేట్ తీసుకొస్తున్న విశ్వక్ సేన్.. పిల్లలు కాదట..!

‘కల్ట్’ టీజర్ అప్డేట్ తీసుకొస్తున్న విశ్వక్ సేన్.. పిల్లలు కాదట..!

Published on Feb 18, 2026 3:30 PM IST

Cult

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు విశ్వక్ తన డైరెక్షన్‌లో మూడో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

ఇప్పటికే చాలా రోజులుగా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘కల్ట్’ (Cult)అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అనౌన్స్‌మెంట్ ఫిబ్రవరి 19న ఉదయం 11.11 గంటలకు ఇవ్వనున్నట్లు విశ్వక్ ప్రకటించాడు.

దీనికి సంబంధించి ‘జీ బూమ్ బా’ అనే ఇండియన్ ఫస్ట్ స్లాషర్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఇది బొమ్మ కాదని, జోక్ కాదని, పిల్లల కోసం కాదని విశ్వక్ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తే ఇదొక మోస్ట్ వయొలెంట్ గ్లింప్స్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. మరి విశ్వక్ సేన్ డైరెక్షన్‌లో రాబోతున్న కల్ట్ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు