టాలీవుడ్లో డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ మూవీ ‘గాయపడ్డ సింహం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా నైజాం, ఆంధ్రా మరియు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దిల్ రాజు సుమారు రూ.6 కోట్లకు దక్కించుకున్నారట. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన ‘ట్రైజర్’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పిస్తున్నారు. స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని సమ్మర్ ట్రీట్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


