ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమోకు టైమ్ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమోకు టైమ్ ఫిక్స్

Published on Feb 19, 2026 2:54 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ( Ustaad Bhagat Singh) ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ కాంబో మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఈ సాంగ్ ప్రోమోపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను నేడు(ఫిబ్రవరి 19) సాయంత్రం 4.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఈ గ్లింప్స్‌లో ఉస్తాద్ ఆరా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ ట్యూన్స్ కంపోజ్ చేశాడని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు