సురేందర్ రెడ్డితో మూవీ.. ఇంకా వెయిటింగ్‌లో పెట్టిన పవన్.. కారణం ఏమిటంటే..?

సురేందర్ రెడ్డితో మూవీ.. ఇంకా వెయిటింగ్‌లో పెట్టిన పవన్.. కారణం ఏమిటంటే..?

Published on Feb 19, 2026 8:00 PM IST

Pawan-Kalyan-and-Surender-R

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్ర స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగు వేస్తున్నాడట. స్టార్ రైటర్ వక్కంతం వంశీ అందించిన కథలో కొన్ని మార్పులు చేయాలని పవన్ ఇప్పటికే సూచించాడు.

దీంతో వాటిని ఇంప్రూవ్ చేసేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి అండ్ టీమ్ కష్టపడుతోంది. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక స్క్రిప్ట్ ఫైనల్ నేరేషన్ పట్ల పవన్ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనే అంశంపై ఓ నిర్ణయానికి వస్తారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ చిత్ర షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పొలిటికల్ కెరీర్‌తో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ మినహా ఆయన మరే ఇతర కొత్త సినిమాలకు ప్రస్తుతానికి సంతకం చేయలేదు. ఈ సినిమా ద్వారా పవన్ ఒక సరికొత్త స్టైలిష్ యాక్షన్ అవతారంలో కనిపిస్తారని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు