మంజునాథ్ హీరోగా ఎస్‌ఎల్‌వి క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

మంజునాథ్ హీరోగా ఎస్‌ఎల్‌వి క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

Published on Feb 20, 2026 6:00 AM IST

maju

‘మా ఊరి ప్రేమకథ’ ఫేమ్ మంజునాథ్ హీరోగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (ఎస్‌ఎల్‌వి) పతాకంపై నూతన చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. నూతన దర్శకుడు అభిరామ్ గంటా తెరకెక్కిస్తున్న ఈ ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రాన్ని వి. లక్ష్మీ దేవి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ ఇవ్వగా, డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ప్రస్తుతం ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న మంజునాథ్.. ఈ కొత్త సినిమాలో ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనున్నారు. ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు. యూట్యూబర్, వెబ్ సిరీస్ మేకర్‌గా అనుభవం ఉన్న అభిరామ్ గంటా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లవ్, కామెడీ, సస్పెన్స్ తదితర అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో మంజునాథ్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించనున్నారని, ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత లక్ష్మీ దేవి వెల్లడించారు. ఈ చిత్రానికి యు. గోవింద రాజులు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు