ఆరా ఆఫ్ ఉస్తాద్ : డీకోడ్ చేసేందుకు వేదికతో పాటు టైమ్ కూడా ఫిక్స్..!

ఆరా ఆఫ్ ఉస్తాద్ : డీకోడ్ చేసేందుకు వేదికతో పాటు టైమ్ కూడా ఫిక్స్..!

Published on Feb 21, 2026 2:05 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే సాలిడ్ న్యూస్ ఇచ్చారు మేకర్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి రెండో సింగిల్ సాంగ్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ పాట విడుదల వేడుకను మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో పవన్ అభిమానులకు ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌లో బాగా పాపులర్ అయిన ఒక మేనరిజం వెనుక ఉన్న అసలు కథేంటి, ఆ వైరల్ ట్రెండ్ ఎలా మొదలైంది అనే ఆసక్తికర విషయాలను దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వెల్లడించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు