హాలీవుడ్‌లో స్ట్రీమింగ్ వర్సెస్ థియేటర్ పోరు మరోసారి వేడెక్కింది. హాలీవుడ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ వర్సెస్ థియేటర్ పోరు నడుస్తూనే ఉంది. తాజాగా సినిమా హాళ్లకు ముప్పు తప్పదని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ బహిరంగంగా హెచ్చరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో కామెరూన్, అమెరికన్ సెనేటర్ మైక్ లీకు లేఖను రాస్తూ.. థియేట్రికల్ మోషన్ పిక్చర్ బిజినెస్ కు ఇది విపత్తు, తన సినిమాలు తర్వాత స్ట్రీమింగ్, వీడియో మార్కెట్లలోనూ ప్రదర్శించబడతాయి, కానీ తన మొదటి ఆప్షన్ మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్సే అని జేమ్స్ కామెరూన్ తెలిపారు.
జేమ్స్ కామెరూన్ ఈ అంశం పై ఇంకా క్లారిటీ ఇస్తూ.. ‘స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యొక్క బిజినెస్ మోడల్ ప్రధానంగా సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైంది, దీంతో సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్లే ధోరణి పెరుగుతుందని, థియేటర్ రిలీజ్‌లు తగ్గిపోవచ్చని జేమ్స్ కామెరూన్ తెలిపారు. పెద్ద స్టూడియోల్లో ఒకటైన వార్నర్ బ్రదర్స్ దిశ మార్చుకుంటే, మిగిలిన స్టూడియోలపైన కూడా ఒత్తిడి పెరిగి, భారీ బడ్జెట్ సినిమాల ఉత్పత్తి తగ్గిపోవచ్చనే భయం వ్యక్తమవుతోంది’ అని జేమ్స్ కామెరూన్ చెప్పారు.


