గత ఏడాది తెలుగు సినిమా దగ్గర మంచి డెబ్యూ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో లిటిల్ హార్ట్స్ తో అలరించిన యూట్యూబ్ ఫేమ్ మౌళి తనూజ్ కూడా ఒకరు. అయితే తనూజ్ హీరోగా ఆ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత మంచి నెక్స్ట్ సినిమాని మాత్రం వెంటనే అనౌన్స్ చేసేయలేదు. ఇక ఈ గ్యాప్ లో ఒక భారీ ఆఫర్ ని తాను అందుకున్నట్టు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
ఆ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏకంగా పుష్ప 2 మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ తో లాకయ్యినట్టు తెలుస్తుంది. మరి ఇలా రెండో సినిమాకే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి అవకాశం అంటే అది భారీ ఆఫర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని కూడా ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాని కూడా లిటిల్ హార్ట్స్ తరహాలోనే ఒక రోమ్ కామ్ లా ట్రై చేస్తారా లేక కంప్లీట్ గా తనూజ్ బాడీ లాంగ్వేజ్ కి సంబంధం లేని కొత్త సబ్జెక్టు ఏమన్నా ట్రై చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.


