కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “టాక్సిక్”(Toxic). దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా గ్లింప్స్ టీజర్ లతో మంచి బజ్ ని రేకెత్తించింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో ధురంధర్ 2 లాంటి సినిమాతో క్లాష్ ఎలా ఉంటుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా టాక్సిక్ సినిమాకి సంబంధించిన క్రేజీ డీటెయిల్స్ మరిన్ని వినిపిస్తున్నాయి. ఇలా సినిమా తాలూకా రన్ టైం పై కొన్ని రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. దీని ప్రకారం ధురంధర్ 2 లానే దీనికీ భారీ రన్ టైం నే మేకర్స్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. టాక్సిక్ ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో థియేటర్స్ లో సందడి చేయనుందట.
మరి ఇందులో ఎంతమేరకు నిజం ఉంది అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అన్నీ ఇదే రేంజ్ రన్ టైంతో వస్తున్నాయి. మరి టాక్సిక్ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 19న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.


