‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?

‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?

Published on Mar 1, 2026 7:02 AM IST

Peddi 1 2

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ హైప్ ని సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమా నుంచి రెండో సాంగ్ గా ఫుల్ మాస్ నెంబర్ ని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఈ మార్చ్ 2న రాబోతుండగా ఈ సాంగ్ కోసం మరింత హైప్ ని అభిమానులు పెంచుకున్నారు.

అయితే ఈ సాంగ్ పై మరో క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. అదేంటంటే ఈ సాంగ్ ని ఏ ఆర్ రెహమాన్ ఆలపించినట్టు తెలుస్తుంది. రెహమాన్ పాడిన పాటలకి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో తెలిసిందే. సో ఇది డెఫినెట్ గా మరో స్యూర్ షాట్ చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. సో ఆరోజు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు