బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా రీసెంట్ గా నటించిన భారీ యాక్షన్ చిత్రం వార్ 2 తో పాన్ ఇండియా ఆడియెన్స్ ని పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత హృతిక్ లైనప్ కూడా మ్యాడ్ లెవెల్లో సెట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాల్లో అంతా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సూపర్ హీరో చిత్రం “క్రిష్ 4” (Krrish 4) కూడా ఒకటి.
హృతిక్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించనున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి ఇప్పుడు నిరాశే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పట్లో ఈ సినిమా తాను మొదలు పెట్టే ఛాన్స్ లేదట. ఎందుకంటే దీనికి ముందు మరో భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చెయ్యాలని తాను చూస్తున్నట్టు తెలుస్తుంది. అది ఏదో కూడా కాదు తన మొట్ట మొదటి సౌత్ ఇండియా ప్రాజెక్ట్ అట.
ఆ మధ్య కన్నడ సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని తాను ముందు పూర్తి చేయాలని చూస్తున్నారట. సో దీని తర్వాతే ఆ సూపర్ హీరో సినిమా రావచ్చు. ఇక హోంబళే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


