కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా మమిత బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. నేడు మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చింది. అయితే తెలుగు ఆడియెన్స్ మొదట కొంత డిజప్పాయింట్ అయినప్పటికీ తర్వాత మేకర్స్ తెలుగులో కూడా వదిలారు.
ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి సెకండ్ లుక్ పోస్టర్స్ కూడా తెలుగు ఇంకా తమిళ్ లో బయటకి వచ్చాయి. వీటిలో మాత్రం సూర్య డెఫినెట్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ రోల్ లో అలరించనున్నారని అనిపిస్తుంది. తన కొడుకుని తన వర్క్ టేబుల్ మీద పెట్టుకొని సూర్య కనిపిస్తున్నారు.
చాలా సింపుల్ లుక్స్ తో బ్యూటిఫుల్ గా ఈ పోస్టర్ కనిపిస్తుంది. మరి వెంకీ అట్లూరి సూర్యతో ఏం ప్లాన్ చేస్తున్నారో కానీ ఒక క్లీన్ ఎంటర్టైనర్ ని అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహిస్తున్నారు.


