ఓటిటి లోకి వచ్చేసిన ‘ఓం శాంతి శాంతి శాంతి’.. కానీ

ఓటిటి లోకి వచ్చేసిన ‘ఓం శాంతి శాంతి శాంతి’.. కానీ

Published on Mar 3, 2026 9:00 AM IST

Om Shanti Shanti Shantihi

రీసెంట్ గా తెలుగు సినిమా నుంచి వచ్చిన రీమేక్ చిత్రమే ‘ఓం శాంతి శాంతి శాంతి’. నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం అనుకున్న రేంజ్ ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమాకి ఒరిజినల్ సినిమా ‘జయ జయ జయ జయహే’ ఇది వరకే ఓటిటిలో చాలా మంది చూసేసారు. దీనితో తెలుగు ఆడియెన్స్ అంత ఎగ్జైట్ కాలేదు.

ఇలా థియేటర్స్ లో ఒక డిజప్పాయింటింగ్ రిజల్ట్ తోనే ముగిసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే వచ్చింది. రేపు మార్చ్ 4 నుంచి సాధారణ సబ్ స్క్రైబర్స్ కి అందుబాటులో ఉంటుంది. సో అపుడు చూడకుండా ఇప్పుడు చూడాలి అనుకునేవారు చూడొచ్చు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు