తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్’ (GTFA) 2025 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతల పూర్తి జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది అవార్డుల్లో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) అద్భుతమైన ప్రతిభను చాటుకుంది.
ఏకంగా తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుని అవార్డుల వేటలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాణ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించడంలో ఈ ప్లాట్‌ఫామ్ సక్సెస్ అయిందని ఈ అవార్డుల సంఖ్యే నిరూపిస్తోంది. ఈటీవీ విన్ గెలుచుకున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
బెస్ట్ డైరెక్టర్ – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ విలన్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ ఫిల్మ్ – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
ఈ అవార్డులను గెలిచిన ఈటీవీ విన్ మరింత ఉత్సాహంగా తమ ప్రేక్షకులకు మరింత నాణ్యమైన కంటెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతుంది.


