మోహన్ బాబు పాత్ర పై దర్శకుడు క్రేజీ కామెంట్స్ !

మోహన్ బాబు పాత్ర పై దర్శకుడు క్రేజీ కామెంట్స్ !

Published on Mar 15, 2026 10:02 AM IST

Mohan-Babu

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలిచిన సినిమా ‘దసరా’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే మూవీ రాబోతుంది. ఐతే, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఐతే, తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హాజరయ్యారు.

కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను పోషిస్తున్న మోహన్ బాబు గురించి శ్రీకాంత్ ఓదెల తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. “నటుడిగా మోహన్ బాబు గారి అసలైన సామర్థ్యం గురించి ప్రేక్షకులలో కొంతమందికి ఇంకా పూర్తి అవగాహన లేదు. మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఆ ‘మోహన్ బాబు’ను తెరపై ఆవిష్కరించడానికి నేను నూటికి నూరు శాతం ప్రయత్నిస్తున్నాను. దీని గురించి నేను ఇప్పుడే ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే సినిమా టీజర్ మరియు ట్రైలర్లలో ఆయన గురించి మరింత స్పష్టంగా తెలుస్తుంది’ అంటూ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు