ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చి 15, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రాజీవ్ కనకాల, వసంత్, మాధురి, జోష్న తదితరులు
దర్శకత్వం : జై
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సంగీతం : డాక్టర్ జోశ్యభట్ల
ఛాయాగ్రహణం : యోగి
కూర్పు : శశి కుమార్ చిట్లూరి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు ఓటిటి యాప్ ఈటీవీ విన్ లో ప్రతివారం స్ట్రీమింగ్ కి వస్తున్న వీక్లి సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ’10/జి రైల్వే క్వార్టర్స్’. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హైదరాబాద్ కి చెందిన రైల్వే క్వార్టర్స్ కి ఓ కొత్తగా పెళ్ళైన జంట సురేష్ (వసంత్), నందిని (మాధురి) లు వస్తారు. అయితే వీరిలో నందినికి ఒక అరుదైన వ్యాధి ఉందని ఆమె అందరితో ఎక్కువ కలవలేదు అని తన భర్తే అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. వీరితోనే క్వార్టర్స్ లోనే ప్రకాష్ రావు (రాజీవ్ కనకాల) తన భార్య, చెల్లెలు జోష్న (జోష్న) లతో ఉంటాడు. అయితే నందిని వల్ల ఆ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు పడ్డ ఇబ్బంది ఏంటి? నిజంగానే ఆమెకి సమస్య ఉందా? ఎందుకు ప్రకాష్ రావు నందిని విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు? చివరికి ఏమైంది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ మధ్య కాలంలో నటుడు రాజీవ్ కనకాలని కొన్ని సీరియస్, ఫన్ రోల్స్ లో కూడా మనం చూసాం అయితే ఇందులో తనలోని కొంచెం గ్రే షేడ్స్ ని కూడా చూపించడం బాగుంది. తన నుంచి ఎపుడో ఈ తరహా రోల్స్ పడ్డాయి. ఇప్పుడు ఇందులో తన రోల్ ని అలా డిజైన్ చేసి అందులోనే మళ్ళీ మరో కోణం చూపించడం బాగుంది.
అలాగే యువ నటుడు వసంత్ కూడా తన రోల్ లో డీసెంట్ నటన కనబరిచాడు. తన పాత్రపై వచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. ఇందులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా ఓకే అనిపిస్తుంది. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఝిమ్మర్ రెడ్డి వంక డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. చూసే ప్రేక్షకుడి దృక్కోణాన్ని మార్చే విధంగా ప్లాన్ చేయడం ఇందులో బాగుంటుంది.
మైనస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కథని ప్రెజెంట్ చేసిన విధానం బాగానే ఉంది కానీ కథ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ థ్రిల్లర్స్ తరహా ఫీల్ నే ఈ చిత్రం కూడా ఆఖరికి మిగులుస్తుంది. సో ఇది ఏమంత గొప్పగా అనిపించదు. అలానే కాస్టింగ్ కూడా ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. నందిని పాత్రలో నటి ఇంకా బాగా పెర్ఫామ్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ఎడిటింగ్ లు డీసెంట్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు జై, ఝిమ్మర్ రెడ్డి వంక కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందించారు. వీరి వర్క్ ఓకే కానీ కథ పరంగా మాత్రం అంత కొత్తదనం లేకపోవడం వల్ల ఇదొక రొటీన్ థ్రిల్స్ నే మిగిల్చినట్టు అయ్యింది. సో వీరి వర్క్ ఓకే అనిపిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ’10/జి రైల్వే క్వార్టర్స్’ ఒక రొటీన్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ఇందులో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి ఒక రొటీన్ ఫీల్ నే మిగులుస్తుంది. ఇవి పక్కన పెడితే ఇందులో మెసేజ్, రాజీవ్ కనకాల లాంటి నటుల పాత్రలు మెప్పిస్తాయి. సో ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే తక్కువ ఆశలు పెట్టుకొని ట్రై చెయ్యండి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


