ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అనే విధంగా పరిస్థితి మారింది. అయితే మారుతున్న కాలంతో పాటుగా చాలానే మారాయి. అలా బాలీవుడ్ సినిమా ఊహించని విధంగా డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. ఇక బాలీవుడ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రికార్డులు బద్దలయ్యే గ్రాసర్ సినిమాలు ఒకొక్కటిగా వస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో చరిత్ర సృష్టిస్తున్న సెన్సేషనల్ చిత్రం “ధురంధర్ 2” కూడా ఒకటి.
ఆల్రెడీ పార్ట్ 1 నే పెను సంచలనంగా మారింది. దీనితో పార్ట్ 2 పై హైప్ తారా స్థాయిలోకి చేరింది. పార్ట్ 2 కూడా అంచనాలు అందుకొని ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని పాన్ ఇండియా లెవెల్లో సొంతం చేసుకుంది. దీనితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేయాల్సింది పోయి బాలీవుడ్ మౌనం వహించడం ఒకింత ఆశ్చర్యకరంగా మారింది. దాదాపు తెలుగు సినిమా నుంచే స్టార్స్ ఈ సినిమాకి అభినందనలు అందించారు.
హిందీ నుంచి రాకేష్ రోషన్, ప్రీతీ జింటా లాంటి వారు స్పందించారు. కానీ మిగతా ఏ ఒక్కరి నుంచి కూడా ఈ సెన్సేషనల్ సక్సెస్ పై ఒక్క ముక్క కూడా బయటకి రాలేదు. దీనితో ఈ భారీ సక్సెస్ ని సొంత ఇండస్ట్రీనే తీసుకోలేకపోతున్నారా? అనే ప్రశ్న కూడా చాలామందిలో మొదలైంది. మెయిన్ గా ఖాన్ హీరోస్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం మరో డిస్కషన్ కి దారి తీసింది. మరి ఈ సినిమాపై ఇంకెంతమంది స్పందిస్తారో చూడాలి.


