మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో రామ్ చరణ్ మరియు చిత్ర హీరోయిన్ జాన్వీ కపూర్‌లతో కలిసి ఒక భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం మేకర్స్ టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమా కోసం అద్భుతమైన మాస్ బీట్‌ను సిద్ధం చేయగా, ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి మృణాల్ చేసే సందడి మెగా అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతోంది. ఈ ప్రత్యేక గీతం కోసం నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో, థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ డీల్స్ అన్నీ భారీ ధరలకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఈ ‘పెద్ది’ జాతర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


