ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!

ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!

Published on Apr 4, 2026 7:04 AM IST

VeeraBhadrudu

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వేసవి కానుకగా మే 14న థియేటర్లలో సందడి చేయనుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే పక్కా మాస్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

​గత కొంతకాలంగా తమిళ చిత్రాలను అదే టైటిల్స్‌తో తెలుగులో విడుదల చేయడంపై ప్రేక్షకుల నుంచి కొంత అసహనం వ్యక్తమవుతోంది. అయితే, ఈ ట్రెండ్‌కు స్వస్తి పలుకుతూ మేకర్స్ ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ‘కరుపు’ చిత్రానికి తెలుగులో ‘వీరభద్రుడు'(Veerabhadrudu) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. నేటివిటీకి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు ఆడియన్స్‌లో సినిమాపై మంచి ఆసక్తిని కలిగిస్తోంది.

​ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య మార్క్ యాక్షన్, ఆర్‌.జె. బాలాజీ మేకింగ్ కలిసి ‘వీరభద్రుడు’ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో నిలబెడతాయో వేచి చూడాలి.

తాజా వార్తలు