సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !

Published on Apr 10, 2026 2:02 AM IST

Dacoit

విడుదల తేదీ : ఏప్రిల్ 10, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్  తదితరులు
దర్శకుడు : షానియల్ డియో
స్క్రీన్ ప్లే : అడివి శేష్
కథ : అడివి శేష్
ఛాయాగ్రహణం : దనుష్ భాస్కర్
కూర్పు : కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు : సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ‘డెకాయిట్. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

హరి దాస్ (అడివి శేష్) తక్కువ కులానికి చెందిన వ్యక్తి. అతను పెద్ద కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హరి  ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. అతను నేరం చేశాడని.. అతనికి శిక్ష పడేలా చేస్తోంది సరస్వతి. అసలు ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది ?, ప్రాణంగా ప్రేమించిన హరిని ఆమె ఎందుకు దూరం చేసుకుంటుంది?, ఆమె పై పగ బట్టిన హరి మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చి ఏం చేశాడు ?, చివరకు వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అడివి శేష్.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి అడివి శేష్ మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో అడివి శేష్ చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

ఇక హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తన మార్క్ నటనతో మెప్పించాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనురాగ్ కశ్యప్ గురించి. చాలా బాగా నటించాడు. తన నటన చాలా రియలిస్టిక్ గా ఉంది. సునీల్ తో పాటు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు షానియల్ డియో తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సరస్వతి పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా,  చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన దర్శకుడు షానియల్ డియో, కథను అంతే బలంగా మలచలేకపోయాడు. కథనంలో మలుపులు ఉన్నా.. అవి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగవు.

నిజానికి సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. అలాగే సినిమా కళాత్మకంగా ఉండటం కారణంగా పక్కా మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు. దీనికి తోడు కొన్ని చోట్ల లాజిక్ కూడా మిస్ అయింది. మొత్తానికి సినిమా పూర్తి స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో పాత్ర వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతలుగా సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

‘డెకాయిట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన కూడా బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు శేష్ – మృణాల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు