ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో వారణాసి కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమా నుంచి ఆల్రెడీ రెండు పాటలు హీరో, విలన్ లపై వచ్చేసాయి. అయితే ఇవి కాకుండా అసలు పాటల అప్డేట్ ఇపుడు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి కూడా వరల్డ్ క్లాస్ సంగీతం అందిస్తున్నారు.
ఇలా ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం బాలీవుడ్ పాపులర్ సింగర్ బాబుల్ సుప్రియోని ఎంచుకుని సాంగ్ కూడా పాడించేసినట్టు కన్ఫర్మ్ చేసారు. హిందీలో సహా బెంగాలీ భాషలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్ ఇతని నుంచి ఉన్నాయి. 2000స్ ఎరాలో బాబుల్ సాంగ్స్ మోత మోగాయి. మళ్లీ ఎట్టకేలకు ఆస్కార్ విన్నర్ తో వారణాసి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో తన సాంగ్ వస్తుండడం అనేది ఒకింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో వేచిచూద్దాం.


