ఈ ఏడాది సంక్రాంతి రేస్ తర్వాత టాలీవుడ్ లో మళ్లీ ఆ రేంజ్ సందడి పెద్దగా కనిపించలేదు. మధ్యలో పవన్ లాంటి స్టార్ హీరో సినిమా పడినా అది కూడా అంత రాణించలేదు. దీనితో నెక్స్ట్ పెద్ద సినిమాల పైనే అందరి కళ్ళు పడ్డాయి. ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ సినిమా పెద్ది పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
మార్చ్ నుంచి ఏప్రిల్ చివరికి షిఫ్ట్ చేసారు కానీ ఇప్పుడు ఏప్రిల్ లో ఆల్రెడీ 10 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. సో వాయిదా అనేది ఖరారు అయ్యిపోయింది. కానీ ఆ కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయకపోవడం ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారింది. సో ఆ డేట్ కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. మరి దాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.


