ఫోటో మూమెంట్: ‘రణబాలి’ సెట్స్ లో విజయ్, రష్మికకి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన యూనిట్

ఫోటో మూమెంట్: ‘రణబాలి’ సెట్స్ లో విజయ్, రష్మికకి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన యూనిట్

Published on Apr 11, 2026 8:00 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు రీసెంట్ గానే పెళ్లి చేసుకొని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీగా కనిపిస్తూనే ఇంకోపక్క తమ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా సాగిస్తున్నారు. ఇలా పెళ్లి తర్వాత కొన్ని మధుర క్షణాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి.

ఇక ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి చేస్తున్న భారీ సినిమా రణబాలి మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ ని సెట్స్ లో ఇచ్చారు. ఈ యువ జంట చేత కేక్ కట్ చేయించి సెట్స్ లో తమ వంతుగా పెళ్లి శుభాకాంక్షలు అందజేశారు. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజా వార్తలు