మన భారతీయ సినిమా దగ్గర ముఖ్యంగా సంగీత రంగంలో ఎంతో అద్భుతంగా రాణించిన గాయనీ గాయకుల్లో పద్మవిభూషణ్ ఆశా బొంస్లే గారు కూడా ఒకరు. తనదైన వినూత్న గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ దిగ్గజ గాయకురాలు ఇప్పుడు కన్ను మూసారన్న వార్త భారతీయ సినిమా ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1933 లో జన్మించిన ఆమె 1940 ల లోనే సంగీత ప్రపంచంలో అడుగు పెట్టారు.
అలా అక్కడ నుంచి ఒక భారతీయ భాషలోనే కాకుండా ప్రపంచ ఇతర భాషల్లో కూడా ఆమె ఏకంగా 12 వేలకి పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె తన 92వ ఏట తుది శ్వాస విడిచారు అని కుటుంబీకులు ఖరారు చేసారు. ఇటీవల ముంబై లోని ఛాతీ సమస్య ఇతర వయసుకి సంబంధించిన సమస్యలతో హాస్పిటల్ లో జాయిన్ కాగా ఈ ఆదివారం మధ్యాహ్నం శివైక్యం అయ్యారు.
మరి ఈ విషాద వార్త విని ఇండియా వైడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు కూడా తమ నివాళులు అర్పించారు. ఆశా బొంస్లే తెలుగు ఆడియెన్స్ కి ఇట్టే స్ట్రైక్ అయ్యే సాంగ్ చందమామ సినిమాలో ‘నాలో ఆశలకు’ ఆలపించారు. ఈ పాడింది ఈమేనా అనే ఆశ్చర్య పోయే వారు కూడా ఇప్పుడు లేకపోలేరు. మరి భారతీయ సినిమా దగ్గర అపారమైన సేవలు అందించిన ఆశా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.
Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.
Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026


