బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. థమన్ ఇప్పటికే, రెండు ట్యూన్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ ఓ ట్యూన్ కి పాటను రాయడం పూర్తి చేశారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సాంగ్ షూట్ అనంతరం, ఓ యాక్షన్ సీన్ ను కూడా అక్కడే షూట్ చేస్తారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు. అలాగే, నయనతారని ఒక మహారాణి పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.


