మహి వి. రాఘవ్ సరికొత్త కామెడీ హారర్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’ మోషన్ పోస్టర్ రిలీజ్

మహి వి. రాఘవ్ సరికొత్త కామెడీ హారర్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’ మోషన్ పోస్టర్ రిలీజ్

Published on Apr 20, 2026 10:00 AM IST

‘ఆనందో బ్రహ్మ’, ‘సేవ్ ది టైగర్స్’ వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌ల సృష్టికర్త మహి వి. రాఘవ్ నుంచి వస్తున్న సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.

సాధారణంగా దెయ్యాలు మనుషులను భయపెడతాయి. కానీ, అసలు భయం అంటే ఏంటో తెలియని పిచ్చివాళ్లు దెయ్యాలకు ఎదురైతే ఎలా ఉంటుంది? దెయ్యాలకు, పిచ్చివాళ్లకు మధ్య జరిగే ఈ వినోదాత్మక పోరాటమే ఈ సినిమా ప్రధానాంశం. సరికొత్త ట్విస్టులు, ఫన్నీ డైలాగ్స్‌తో ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. గోగు ఆర్.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పూకీ ఫన్ రైడర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు