రాజా శివాజీ’లో సర్ప్రైజింగ్ క్యామియో.. బిగ్ బాస్ షోలో రివీల్ చేసిన హీరో

రాజా శివాజీ’లో సర్ప్రైజింగ్ క్యామియో.. బిగ్ బాస్ షోలో రివీల్ చేసిన హీరో

Published on Apr 20, 2026 8:03 PM IST

Raja-Shivaji

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ సినిమాల్లో రాజా శివాజీ కూడా ఒకటి. రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించిన ఈ భారీ హిస్టారికల్ సినిమాలో తాను ఛత్రపతి శివాజీ మహారాజ్ గా నటిస్తున్నాడు. అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఇటీవల పలు ట్రోల్స్ వచ్చాయి కానీ తాము మాత్రం సినిమాపై గట్టి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే హీరో రితేష్, తన భార్య జెనీలియా కలిసి బిగ్ బాస్ మరాఠి షోకి హాజరు కాగా అందులో ఓ సర్ప్రైజింగ్ క్యామియో కోసం తాను రివీల్ చేయడం బిగ్ అప్డేట్ గా మారింది. తమ సినిమాలో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నారు అని రివీల్ చేయడం ఇప్పుడు కేజ్రీగా మారింది.

దీనితో ఆ షో కంటెస్టెంట్స్ కూడా ఇది విని షాకయ్యారు. సో సల్మాన్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనున్నారో చూడాలి. ఇక ఈ సినిమాకి రితేష్ నే దర్శకత్వం కూడా వహించగా అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ తదితరులు ఈ సినిమాలో నటించారు. అలాగే ఈ సినిమా ఈ మే 1న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు