రీసెంట్ గా మలయాళ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాల్లో చాలా చిన్న సినిమా వాలా 2 కూడా ఒకటి. అక్కడ రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇదే ఊపులో తెలుగు రిలీజ్ కి కూడా సిద్ధం అయ్యింది. బ్లాక్ బస్టర్ నిర్మాత సాహు గారపాటి మలయాళంలో నిర్మాణం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరిట విడుదల అయ్యి సాలిడ్ రెస్పాన్స్ ని మొదటి రోజు అందుకుంది.
ఇక మొదటి రోజే అనుకుంటే రెండో రోజు మొదటి రోజుకంటే మించి పెర్ఫామ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అంతే కాకుండా హవర్లి బుకింగ్స్ లో కూడా వాలా 2 చిత్రం స్ట్రాంగ్ బుకింగ్స్ నమోదు చేస్తుండడం విశేషం. ఇలా ఈ చిన్న సినిమా తెలుగులో కూడా సత్తా చాటుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సావిన్ ఎస్ఏ దర్శకత్వం వహించగా హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ తదితరులు లీడ్ నటులుగా నటించారు.



