నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 111వ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గానే మొదలైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారిన సంగతి తెలిసిందే.
మొదట కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమా కోసం ఫిక్స్ అయ్యింది కానీ తర్వాత మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ కాజల్ తోనే ముందుకు వెళుతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. కాజల్ తో మొదటి షెడ్యూల్ కూడా ఇప్పుడు మొదలు కానుండగా కాజల్ ఈ షెడ్యూల్ కోసం ఈ నెల మొత్తం కేటాయించినట్టు తెలుస్తుంది. సో ఈ మే మొత్తం కాజల్ బాలయ్య సినిమాలో బిజీగా ఉండనుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె ప్రెజెన్స్ పై మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఒకటి ఇవ్వాల్సి ఉంది.



