నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన మొదటి సాంగ్ ‘రా రా ధీవర’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాట నిఖిల్ పవర్ఫుల్ వారియర్ లుక్‌ను ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ హై-ఎనర్జీ సాంగ్ స్పాటిఫైలో 100K కి పైగా స్ట్రీమ్స్తో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. రవి బస్రూర్ అందించిన థంపింగ్ మ్యూజిక్, దానికి తోడు నిఖిల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ఈ పాటను ఒక రేంజ్‌కు తీసుకెళ్లాయి. అద్భుతమైన కొరియోగ్రఫీ, పవర్ఫుల్ లిరిక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ ఒక్క పాటతోనే ‘స్వయంభు’ టీమ్ భారీ స్థాయిలో పబ్లిసిటీని దక్కించుకుంది.
పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. రానున్న రోజుల్లో సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


