‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రను అట్లీ డిజైన్ చేశారట. పైగా ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట.
ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.


