అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘లెనిన్’. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ మాస్ విలేజ్ డ్రామా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ ని విడుదల చేశారు. అయితే ఈ టీజర్ మాత్రం సినిమాపై బజ్ ని మరింత పెంచేలా ఉందని చెప్పాలి. మొన్నామధ్య హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పై వదిలిన పోస్టర్ లుక్ లోనే స్టార్ట్ అయ్యిన ఈ టీజర్ లో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ తో మగ వేషంలో ఆమె అదరగొట్టింది.
ఇక అక్కడ నుంచి ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ కన్వర్జేషన్ అలా సినిమా విలేజ్ నేపథ్యంలో సీన్స్ తో ఆకట్టుకునే విధంగా వెళ్ళిపోయింది. అఖిల్ కూడా మంచి మాస్ లుక్స్ మంచి పెర్ఫామెన్స్ ని ఇందులో కనబరచగా బ్రహ్మాజి లాంటి వారు తమ కొత్త లుక్ తో ఆశ్చర్యపరిచారు. అయితే ఇందులో అంతా బాగానే ఉంది కానీ అఖిల్ డబ్బింగ్ మాత్రం డిఫరెంట్ గా వచ్చింది అని చెప్పాలి.
రాయలసీమ యాసలో కొనసాగుతున్న పాత్రల సంభాషణలు ఇందులో అఖిల్ ఒరిజినల్ డబ్బింగ్ మిస్సయినట్టు ఇందులో వినిపిస్తుంది. మరి ఇది టెక్నికల్ పొరపాటా లేక డబ్బింగ్ మార్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణం వహించారు. అలాగే జూన్ 26న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.


