అఖిల్ ‘లెనిన్’ పై కొత్త అప్ డేట్ !

అఖిల్ ‘లెనిన్’ పై కొత్త అప్ డేట్ !

Published on May 24, 2026 10:04 AM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. రాయలసీమ యాసలో ఈ సినిమా సాగనుంది. ప్రధాన పాత్రల సంభాషణలు యాసలో ఉంటాయట. ఐతే, అఖిల్ వాయిస్ కూడా పక్కా యాసలోనే ప్లాన్ చేశారట. టీజర్ లో అఖిల్ ఒరిజినల్ వాయిస్ కి దూరంగా ఉన్నా.. సినిమాలో అఖిల్ వాయిస్ లోనే యాస ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ మాత్రం సినిమాపై బజ్ ని మరింత పెంచింది.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

తాజా వార్తలు