‘జన నాయగన్’ రిలీజ్ డేట్.. విజయ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్!

‘జన నాయగన్’ రిలీజ్ డేట్.. విజయ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్!

Published on May 24, 2026 4:00 PM IST

Jana Nayagan

ఇళయ దళపతి అలాగే ఇప్పుడు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం మన టాలీవుడ్ సూపర్ హిట్ భగవంత్ కేసరి కి రీమేక్ గా తీశారు. అయితే ఈ చిత్రం విడుదల అనేక మలుపులు తిరిగితే ఎట్టకేలకి విజయ్ సీఎం అయ్యాకే రిలీజ్ అవ్వాలని రాసుందేమో ఫైనల్ గా తాను సీఎం గా మారిన తర్వాతే థియేటర్స్ లో విడుదలకి సిద్ధం అయ్యింది.

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అది కూడా విజయ్ అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే సీజన్ లో లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ జూన్ 22న విజయ్ పుట్టినరోజు అయితే జూన్ 19న గ్రాండ్ గా సినిమా థియేటర్స్ లో విడుదల కానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్స్ లో డేట్ వచ్చేసింది. సో దీనిపై అఫీషియల్ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మమిత బైజు కూడా కీలక పాత్రలో నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు