‘పెద్ది’తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం – శివ రాజ్‌కుమార్

‘పెద్ది’తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం – శివ రాజ్‌కుమార్

Published on May 25, 2026 6:13 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. జూన్ 3 నుంచే ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో తాజాగా ఈ చిత్ర ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించిన డెడికేషన్, ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి తాను షాక్ అయ్యానని శివ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. సినిమా మొదలైనప్పటి నుండి ముగిసే వరకు చరణ్ చూపించిన డెడికేషన్ అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ చిత్రంలో చరణ్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌కు ఆయనకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ని పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేయడం చాలా కష్టమైన పని అని.. కానీ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ మ్యాజిక్‌ను స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించాడని ప్రశంసించారు.

ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని ఇస్తుందని, థియేటర్ల నుండి బయటకు వచ్చాక ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటారని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ లాంటి ఒక ఇన్‌స్పైరింగ్ పాత్రను పోషించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ ప్రాజెక్ట్ వల్ల రామ్ చరణ్‌తో తనకున్న బంధం మరింత బలపడిందని శివ రాజ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు