తమిళ సినిమాలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్.. ఇకపై 5 షోలు..!

తమిళ సినిమాలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్.. ఇకపై 5 షోలు..!

Published on May 25, 2026 10:04 PM IST

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో బిజీగా మారిపోయాడు. రాజకీయాలపై పూర్తి శ్రద్ధ పెట్టడం కోసం ఆయన ప్రస్తుతానికి సినిమాలకు స్వస్తి పలికాడు. విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, నటుడి నుండి ముఖ్యమంత్రిగా మారిన విజయ్ తాజాగా సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

తమిళనాడులోని అన్ని థియేటర్లలో ఏ కొత్త తమిళ సినిమా విడుదలైనా, మొదటి వారం రోజులు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేలా కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికోసం థియేటర్ల యాజమాన్యాలు ఎలాంటి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది జూన్ నుండి విడుదలయ్యే అన్ని కొత్త తమిళ చిత్రాలకు ఈ సరికొత్త నిబంధన వర్తించనుంది.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు మరియు క్రేజ్ ఉన్న చిత్రాలకు పెద్ద బూస్ట్‌లా మారనుంది. టికెట్ల ధరలను విపరీతంగా పెంచి ప్రేక్షకులకు భారం చేయడం కంటే, ఇలా రోజుకు ఐదు ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఎగ్జిబిటర్లు నష్టపోకుండా లాభాలు గడించవచ్చని విజయ్ భావించారు. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తాజా వార్తలు