ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలకే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టడం కష్టంగా మారింది. అలాంటిది ఓ చిన్న సినిమాపై ఆ చిత్ర నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మిగతా పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని, ఆడియో పరంగా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్రబృందం చాలా ధీమాగా ఉంది. అయితే, ఈ సినిమాతో వంద కోట్లు కొడతాం.. అని నిర్మాత ధీరజ్ మొగలినేని ఓపెన్‌గా ప్రకటించారు.
గతంలో సంచలన విజయం సాధించిన ‘బేబీ’ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించాడు.
యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు క్లిక్ అయితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అదే నమ్మకంతో ఈ సినిమా టీమ్ వంద కోట్ల టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది. ఈ చిత్రాన్ని సాయి రాజేష్, ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నిజంగానే ఈ రేర్ ఫీట్ సాధ్యం అయ్యేనా అనేది వేచి చూడాలి.


