అక్కడ స్టడీగా దూసుకెళ్తున్న ‘దృశ్యం-3’.. నెక్స్ట్ టార్గెట్ అదే..!

అక్కడ స్టడీగా దూసుకెళ్తున్న ‘దృశ్యం-3’.. నెక్స్ట్ టార్గెట్ అదే..!

Published on May 27, 2026 12:27 AM IST

Drishyam-3

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన క్రేజీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ మూవీ ‘దృశ్యం-3’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఊహించని ఫలితాన్ని రాబడుతోంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. సాధారణంగా మిక్స్‌డ్ రివ్యూలు వచ్చిన పెద్ద సినిమాలకు మొదటి వర్కింగ్ డే కలెక్షన్స్ భారీగా పడిపోతాయి. కానీ, ఈ క్రైమ్ థ్రిల్లర్ విషయంలో అలా జరగకుండా స్టడీగా రాణిస్తోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. అక్కడ ఇప్పటివరకు ఈ చిత్రం 1.64 మిలియన్ డాలర్ల మార్కును దాటి, 2 మిలియన్ డాలర్ల క్లబ్‌ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. కేవలం యూఎస్‌ఏ గ్రాస్ మాత్రమే ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లను క్రాస్ చేయడం విశేషం.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపి, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రలు పోషించారు. మిక్స్‌డ్ రిపోర్ట్స్‌తో కూడా స్ట్రాంగ్‌గా నిలబడిన ‘దృశ్యం 3’ లాంగ్ రన్‌లో టోటల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు