బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్‌తో విజయ్ దేవరకొండ చర్చలు.. దానికోసమేనా..?

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్‌తో విజయ్ దేవరకొండ చర్చలు.. దానికోసమేనా..?

Published on May 28, 2026 8:00 PM IST

Vijay-Devarakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే, విజయ్ తన నెక్స్ట్ సినిమా కోసం వైవిధ్య చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్‌తో చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను తొలుత యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా విజయ్, విక్రమ్ కుమార్ ఇద్దరూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ ఆఫీస్‌లో కనిపించడంతో నిర్మాత మారినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ హిందీ ప్రొడక్షన్ హౌస్‌తో జతకట్టబోతున్నాడా అనే విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు