గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బాలకృష్ణ ఈ వారంలో ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాలయ్యపై సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ షెడ్యూల్ చాలా కీలకంగా మారింది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని టాక్. సముద్రఖని ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.


