కన్నడ పాపులర్ స్టార్స్ లో యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సార్జా కూడా ఒకరు. మరి యంగ్ హీరో నటించిన లేటెస్ట్ చిత్రమే ‘కేడీ: ది డెవిల్’. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రేష్మ ననయ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించినప్పటికీ ఆ రేంజ్ లో హిట్ గా మాత్రం నిలవలేకపోయింది.
కన్నడలో అయినా కొన్ని రోజులు థియేటర్స్ లో ఉంది కానీ తెలుగులో మాత్రం మినిమమ్ కూడా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ 5 వారికి సొంతం చేసుకోగా అందులో ఈ జూన్ 5 నుంచి వస్తున్నట్టు డేట్ ఖరారు చేసేసారు. ఒరిజినల్ కన్నడతో పాటుగా తెలుగు సహా తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ని కన్ఫర్మ్ చేశారు.
ఇక ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ క్యామియో రోల్ లో నటించగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సాలిడ్ రోల్ చేశారు. అలాగే శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ సినిమాని కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.


