యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అందాల భామ అనంతిక సనిల్కుమార్ జంటగా ‘రోమాంచకం’ అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను భద్రకాళి పిక్చర్స్ మరియు వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
‘ఈ కథ వింటున్నంత సేపూ నేను మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. సినిమా అంతటా వినోదం పంచడమే కాకుండా, దీని వెనుక ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. నా కెరీర్లో మొదటిసారిగా నేను ఒక చిత్రాన్ని సమర్పిస్తున్నాను’ అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్త పరిచాడు.
ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నాడు. మరి విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ ‘రోమాంచకం’ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
I had a heartfelt laugh throughout the narration. Beneath all the fun, there’s a strong emotional tact, and for the first time, I’m presenting the film.
Glad to announce that BHADRAKALI PICTURES is coming out with a very unique musical romantic comedy.#Romanchakam… pic.twitter.com/DpYHUVRYlK— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 29, 2026


