బాలయ్య బర్త్ డే ట్రీట్.. క్లాసిక్ ‘భైరవద్వీపం’ రీ-రిలీజ్..!

బాలయ్య బర్త్ డే ట్రీట్.. క్లాసిక్ ‘భైరవద్వీపం’ రీ-రిలీజ్..!

Published on May 30, 2026 2:00 AM IST

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అద్భుతమైన వింటేజ్ ట్రీట్ సిద్ధమైంది. బాలయ్య కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన క్లాసిక్ సోషియో ఫాంటసీ అద్భుతం ‘భైరవద్వీపం’ మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. క్వాలిటీ పరంగా సరికొత్త అనుభూతిని ఇచ్చేలా 4కె అండ్ 2కె డిజిటల్ ఫార్మాట్‌లో జూన్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. చందమామ విజయ కంబైన్స్ సమర్పణలో, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది.

సెన్సేషనల్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మాయాజాలంతో, అప్పట్లో టాలీవుడ్‌లోనే విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బి. వెంకట్రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. మాధవపెద్ది సురేష్ అందించిన స్వరాలు, అద్భుతమైన పాటలు ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్ర కాపీరైట్స్ హోల్డర్‌గా కె. శ్రీనివాసు నాయుడు వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం క్యూబ్, యూఎఫ్ఓ టెక్నాలజీలతో సరికొత్త విజువల్, ఆడియో క్వాలిటీతో వస్తున్న ఈ సినిమాను థియేటర్లలో చూడటం నందమూరి అభిమానులకు ఒక మధురమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్ 10న బాలయ్య బర్త్‌డే వేడుకలు థియేటర్లలో ఈ క్లాసిక్ సినిమాతో మరింత హోరెత్తనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు