రికార్డులు సృష్టిస్తున్న మరాఠీ చిత్రం !

రికార్డులు సృష్టిస్తున్న మరాఠీ చిత్రం !

Published on May 31, 2026 8:00 AM IST

మరాఠీ చిత్రం ‘దేవూల్‌ బంద్‌ 2’ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. స్నేహల్‌ తార్డే, మోహన్‌ జోషిక కీలక పాత్రల్లో ప్రవీణ్‌ తార్డే దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే, కేవలం రూ.9 కోట్లతో రూపొందిన ఈ మూవీ 9 రోజుల్లోనే సుమారు రూ.40 కోట్లు వసూలు చేయడం విశేషం. పైగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 మరాఠీ చిత్రాల్లో ఈ సినిమా ఒకటిగా నిలవడం మరో విశేషం.

ఇంతకీ, ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంగీత పేగుడే (స్నేహల్‌) మహిళా రైతు. కష్టాలతోనే ఆమె సహవాసం. తన బాధలను తీర్చమని రోజూ దేవుడిని వేడుకుంటుంది. కానీ, ఏ ప్రయోజనం ఉండదు. ఒకరోజు తీవ్ర అసహనానికి గురై నది సమీపంలో ఉన్న చీమల పుట్టపై రాయిని విసిరికొడుతుంది. దీంతో ఆమెకు శ్రీస్వామి సమర్థ్‌ దర్శనమిస్తారు. ఆ తర్వాత స్నేహల్‌ జీవితంలో ఏం జరిగింది అనేది ఈ కథ. అన్నట్టు ఈ సినిమా కోసం 33 గంటలు ఏకధాటిగా షూటింగ్‌ చేశారట.

తాజా వార్తలు