Mega 158: చిరు, బాబీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్!

Mega 158: చిరు, బాబీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on May 31, 2026 4:59 PM IST

Chiru-Boby

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ 158వ సినిమాని తన బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గానే చాలా ఘనంగా మొదలైంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మెగాస్టార్ సహా యంగ్ హీరోయిన్ అనశ్వర రంజన్ పై కొన్ని కీలక ఫ్యామిలీ సీక్వెన్స్ లతో స్టార్ట్ కాగా ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం మేకర్స్ ఈ జూన్ నుంచి పొలాచ్చిలో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాల మేర కొనసాగవచ్చట. ఇక ఈ సినిమాకి కూడా బాబీ నెక్స్ట్ లెవెల్లో అంతకు మించిన టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో తెలుగులో తమ మొదటి సినిమాగా మొదలు పెట్టారు.

తాజా వార్తలు