శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ ఇటీవల మే 22, 2026న థియేటర్లలో విడుదలై, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా రేపటి(జూన్ 5, 2026) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని చిత్రాలను త్వరగా ఓటీటీలోకి తెచ్చే ట్రెండ్‌లో భాగంగా ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. విశేషం ఏంటంటే, ఆహా ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది.
ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం కీలక పాత్రలు పోషించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. థియేటర్లలో మిస్ అయిన థ్రిల్లర్ ప్రియులు రేపటి నుండి ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించవచ్చు.



