సమీక్ష: ఐ, నోబడీ – పృథ్విరాజ్ సుకుమారన్ మెప్పించినా.. కథనంలో పట్టు తప్పింది!

సమీక్ష: ఐ, నోబడీ – పృథ్విరాజ్ సుకుమారన్ మెప్పించినా.. కథనంలో పట్టు తప్పింది!

Published on Jul 11, 2026 2:02 AM IST

విడుదల తేదీ : జూలై 10, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : పృథ్విరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీం షా, అశోకన్, ఐరా తదితరులు
దర్శకత్వం : నిజాం బషీర్
నిర్మాతలు : సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్. మెహతా, సి.వి. సారథి
సంగీతం : జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
కూర్పు: రమీజ్ ఎంబీ

మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెర్సటైల్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నిజాం బషీర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మలయాళ చిత్రం ‘ఐ, నోబడీ’. టాలెంటెడ్ బ్యూటీ పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఈరోజు (జూలై 10) థియేటర్స్ లో తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ:

రాజీవ్ (పృథ్విరాజ్ సుకుమారన్) ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు కూతుళ్లతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు బ్యాంకు నుండి 17 కోట్ల రూపాయల డబ్బుతో పారిపోతున్న ముగ్గురు దొంగలు రాజీవ్‌ను బందీగా చేసుకుంటారు. ఆ తర్వాత జరిగిన ఛేజింగ్‌లో ఆ దొంగలు చనిపోతారు. కట్ చేస్తే.. ఆ దొంగిలించబడిన భారీ సొమ్ము ఎక్కడికి పోయింది? అనే ప్రశ్న మొదలవుతుంది. ఈ క్రమంలో రాజీవ్ చుట్టుపక్కల వారు, కొలీగ్స్, చివరికి పోలీసులు కూడా ఆ మిస్సింగ్ మనీ రాజీవ్ దగ్గరే ఉందని, ఈ దోపిడీతో అతనికి లింక్ ఉందని అనుమానించడం స్టార్ట్ చేస్తారు. మరి నిజంగానే రాజీవ్ ఆ క్రైమ్‌లో భాగస్వామినా? లేక అతడిని ఎవరైనా ఇరికించారా? ఇంతకీ ఆ 17 కోట్లు ఏమయ్యాయి? అనేదే తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఎంత డబ్బున్నా ప్రశాంతతను, సంతోషకరమైన జీవితాన్ని భర్తీ చేయలేదు అనే ఒక మంచి పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం ఇందులో బాగుంది. కోర్ పాయింట్ పాతదే అయినా, దానికి జోడించిన సబ్‌ప్లాట్స్ మాత్రం సినిమాకు కాస్త ఫ్రెష్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎలా ఉంది, అది ప్రజల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే కోణాన్ని బాగా చూపించారు.

ఇక నటీనటుల్లో పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాన్‌గా, క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యక్తిగా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్‌లో తన హావభావాలు మెప్పిస్తాయి. భార్యగా పార్వతి తిరువోతు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పృథ్విరాజ్, పార్వతిల మధ్య వచ్చే సీన్స్ బాగా కుదిరాయి.

ఇక ఇతర పాత్రల్లో హకీం షా ఓకే అనిపించగా, అశోకన్ కొన్ని క్రూషియల్ సీన్స్‌లో బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. చిన్న కూతురిగా నటించిన ఐరా స్క్రీన్‌పై ఉన్నంతసేపు కాస్త రిలీఫ్ ఇస్తుంది. మొదటి భాగంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్స్ మాత్రం చాలా క్రిస్పీగా, ఇంట్రెస్టింగ్ రేసీ నరేషన్‌తో సాగుతాయి.

మైనస్ పాయింట్స్:

ఈ తరహా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉండాలి. నటీనటులు ఎంత బాగా చేసినా కథనం బోర్ కొడితే ఆడియెన్స్‌కు కనెక్ట్ అవ్వడం కష్టం. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతూ సాగదీసినట్లు అనిపిస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ ప్రామిసింగ్‌గా స్టార్ట్ అయినా, ముందుకు వెళ్లేకొద్దీ మాత్రం కథనం ట్రాక్ తప్పింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో చీఫ్ మినిస్టర్ ఎంట్రీ ఇచ్చే సీన్స్ చాలా ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. ఒక నార్మల్ బ్యాంకు రాబరీ ఇష్యూలో సీఎం అంత ఈజీగా ఇన్వాల్వ్ అవ్వడం ఏంటనేది కాస్త లాజిక్‌కు దూరంగా ఉంది.

అన్నింటికంటే పెద్ద మైనస్ క్లైమాక్స్. సినిమా ముగిసేసరికి ప్రేక్షకుడికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది పోయి, ఓపెన్ ఎండ్ అంటూ అయోమయానికి గురి చేశారు. ఇది గందరగోళంగా మిగిలిపోయింది. క్రిస్ప్ ఎడిటింగ్ తో రన్‌టైమ్ తగ్గించి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లను కూడా సరిగ్గా వాడుకోలేదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది, మూడ్‌ను బాగా క్యారీ చేశారు. ఎడిటర్ రమీజ్ ఎంబీ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని రిపీటెటివ్ సీన్స్‌ను కట్ చేయాల్సింది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. తన మ్యూజిక్‌తో చాలా నార్మల్ సీన్స్‌ను కూడా ఎలివేట్ చేశారు. నిక్ బెన్, కలై కింగ్సన్, అమిత్ జాలీ యాక్షన్ కొరియోగ్రఫీ మెప్పిస్తుంది. అయితే తెలుగు డబ్బింగ్ పరంగా టైటిల్స్, ఎండ్ క్రెడిట్స్, సైన్ బోర్డుల మీద మేకర్స్ కనీస శ్రద్ధ పెట్టకపోవడం మైనస్.

ఇక దర్శకుడు దర్శకుడు విషయానికి వస్తే నిజాం బషీర్ ఎంచుకున్న లైన్ బాగున్నా, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయడంలో తడబడ్డారు. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేపై మరింత వర్క్ చేయాల్సింది. కథనం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ అనవసరపు ల్యాగ్ మూలాన సినిమా ఫ్లో దెబ్బ తింది. సో ఇలాంటి విషయాల్లో తాను జాగ్రత్త వహించాల్సింది.

తీర్పు:

ఇక ఫైనల్ గా చూసుకుంటే.. ‘ఐ, నోబడీ’ అనేది పృథ్విరాజ్ సుకుమారన్ వన్‌మెన్ షో మరియు జేక్స్ బిజోయ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సాగే ఒక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్ గా నిలుస్తుంది. స్లోగా సాగదీతగా అనిపించే ఫస్టాఫ్, లాజిక్ లేని ప్రీ-క్లైమాక్స్, కన్‌ఫ్యూజింగ్ క్లైమాక్స్ సినిమాను దెబ్బతీశాయి. స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ఇదొక ఓకే ఛాయిస్ కావచ్చు, కానీ అంచనాలు మాత్రం లిమిట్స్‌లో పెట్టుకుని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు