ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 10 జూలై , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5
నటీనటులు : సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, దియా మీర్జా, తిలోత్తమ షోమ్ తదితరులు
దర్శకత్వం : సిద్ధార్థ్ పి మల్హోత్రా
నిర్మాతలు : సిద్ధార్థ్ పి మల్హోత్రా, సప్నా మల్హోత్రా
సంగీతం : మిథున్, జూలియస్ పకియం
ఛాయాగ్రహణం : జిష్ణు భట్టాచార్జీ
కూర్పు : శ్వేతా వెంకట్ మాథ్యు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ తో పాటుగా ఓటిటిలో కూడా పలు డైరెక్ట్ సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అలా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ నటించిన సినిమా ‘ఇక్కా’ కూడా ఒకటి. ఒక కోర్ట్ రూమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక పేరు మోసిన వ్యాపారవేత్త కొడుకు అయినటువంటి శౌర్యమాన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) ఒక అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ఇరుక్కుంటాడు. దీంతో ఇది వారి కుటుంబ పరువు ప్రతిష్టలకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఈ కేసుని ఎలాగైనా గెలిచి తీరాలని ఒక్క కేసు కూడా ఓడిపోని, న్యాయవాదుల్లో ‘ఇక్కా’ అని పేరుమోసిన సక్సెస్‌ఫుల్ లాయర్ అర్జున్ మెహ్రా(సన్నీ డియోల్)ను ఈ కేసు వాదించేలా ఒప్పిస్తారు. అర్జున్ మెహ్రా తొలుత నో చెప్పినా తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ కేసును టేకప్ చేస్తాడు. అటు ప్రాసిక్యూషన్ లాయర్‌గా మధుర బెనర్జి(తిలోత్తమ షోమ్) ఈ కేసును వాదిస్తుంది. ఇక ఇక్కడ నుంచి కథ ఎలా మారింది? ఎందుకు అర్జున్ ముందు నో చెప్పి మళ్ళీ వాదించడానికి వస్తాడు? అసలు బాధితురాలిని ఎవరు చంపారు? అర్జున్ శౌర్యమాన్‌ను నిర్ధోషిగా నిరూపిస్తాడా..? మధుర బెనర్జి ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశపెడుతుంది..? చివరకు కథ ఎలా మలుపు తిరిగింది..? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
డెఫినెట్ గా మంచి కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమాలు లాంటివి ఇష్టపడేవారికి ఈ ఇక్కా సినిమా కూడా మంచి ట్రీట్ ని అందిస్తుంది అని చెప్పవచ్చు. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే ఎక్కడా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్లిపోవడం ఇందులో బాగుంది. అక్కడ నుంచి కేసు మరింత లోతుకు వెళుతున్న సమయంలో నడిచే కథనం, వచ్చే ట్విస్ట్ లు మెప్పిస్తాయి.
ముఖ్యంగా లాయర్స్ నడుమ జరిగే వాగ్వాదాలు ఒకరికి ఒకరు ఇచ్చే సమాధానాలు ట్విస్ట్ లు ఇందులో బాగున్నాయి. వీరి నడుమ నడిచే డ్రామా అంతా ఇక్కడ ఇంప్రెస్ చేస్తుంది. ఇక లాయర్లుగా కనిపించిన సన్నీ డియోల్ మరియు తిలోత్తమ తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
సన్నీ తన రోల్ కి తగ్గట్టుగా హుందాగా తన పాత్రని మైంటైన్ చేస్తూ రక్తి కట్టిస్తే తిలోత్తమ ఒక జూనియర్ లాయర్ గా మిడిల్ క్లాస్ గృహిణిగా బాగా చేశారు. మెయిన్ గా కోర్ట్ లో నడిచే కొన్ని సీన్స్ లో ఆమె నిస్సహాయత చాలా నాచురల్ గా కనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా మరో హైలైట్ నటుడు అక్షయ్ ఖన్నా. ధురంధర్ సినిమాలో సాలిడ్ పెర్ఫామర్ గా హైలైట్ అయిన ఈ నటుడు ఇక్కాలో కూడా మంచి పర్ఫామెన్స్ చేశారు. వీరితో పాటు ఇతర నటీనటులు కూడా బానే చేశారు. అలానే కథనం క్లైమాక్స్ పోర్షన్ మాత్రం హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పటివరకు యావరేజ్ రేంజ్ లోనే ఉంది అనుకునే సమయంలో క్లైమాక్స్ పోర్షన్ అలాగే ఒకొక్కటిగా రివీల్ చేసిన ట్విస్ట్ లు ఈ కోర్ట్ రూమ్ డ్రామాని మరింత ఆసక్తికరంగా మార్చాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో సన్నీ డియోల్ రోల్ ని డిజైన్ చేసిన తీరు బాగున్నా, కథలో కొత్తదనం లేకపోవడంతో చాలా రెగ్యులర్‌గానే అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఓ సున్నితమైన అంశాన్ని రివీల్ చేసిన విధానం పెద్దగా వర్కవుట్ కాదు. ఇలాంటి అంశాలను సినిమాల్లో ఓకే కానీ, రియల్ లైఫ్‌లో పెద్దగా వర్కవుట్ కావు.
వీటితో పాటుగా అక్కడక్కడ కథనం కొంచెం స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది ఓ కోర్ట్ రూమ్ లో జరిగే బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ మిగతా సినిమాల్లో ఉండేలా ఎక్కడా ఇద్దరు లాయర్లు నడుమ సెక్షన్ లు చెబుతూ వాదోపవాదాలు చేసినట్టు కనిపించదు. ఇలాంటివి కూడా యాడ్ చేస్తే చూసే ఆడియెన్స్ కి కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా అవగాహన కూడా వచ్చి ఉండేది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ‘ఇక్కా’ అనే ఈ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాను తనదైన స్టయిల్‌లో ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. కోర్ట్ రూమ్ డ్రామాలకు కావాల్సిన సిచ్యువేషన్స్, యాక్టర్స్ సెలక్షన్, వారి నుంచి రాబట్టుకున్న ఔట్‌పుట్ విషయాల్లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంగీతం పరంగా ఈ చిత్రానికి బీజీఎం బాగుంది. కెమెరా వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు:
మొత్తంగా చూస్తే.. ‘ఇక్కా’ ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా ఫర్వాలేదనిపిస్తుంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, తిలోత్తమ తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. కోర్ట్‌లో సాగే డ్రామా, ట్విస్టులు, క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. కథలో కొత్తదనం లేకపోవడం, స్లో గా సాగే కొన్ని సీన్స్ మైనస్. కోర్ట్ రూమ్ డ్రామా మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఈ వీకెండ్‌లో ఓసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


