ప్రభాస్ ‘స్పిరిట్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ!

ప్రభాస్ ‘స్పిరిట్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ!

Published on Jul 19, 2026 10:01 PM IST

Spirit

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ సంతరించుకున్న ఈ సినిమాని సందీప్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

అయితే ప్రభాస్ నుంచి ఈ సినిమా మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతుండగా లేటెస్ట్ గా సందీప్ వంగ ఓ సాలిడ్ క్లారిటీ ఈ సినిమాపై ఇవ్వడం వైరల్ గా మారింది. ఓ ఈవెంట్ కి హాజరైన సందీప్ వంగ స్పిరిట్ సినిమా ప్రస్తుతానికి 40 శాతం పూర్తయినట్టుగా తాను కన్ఫర్మ్ చేశారు.

సో ఇంకో 60 శాతం షూట్ పూర్తి చేసుకొని సినిమా ఆన్ టైం వచ్చే ఛాన్స్ గ్యారెంటీగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సందీప్ ఆస్థాన సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు సంయుక్తంగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని పాన్ ఆసియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు