ఇటీవల ట్రైలర్ తోనే మంచి మార్కులు కొట్టేసిన టాలీవుడ్ చిత్రాల్లో కొత్త నటీనటులు జయకృష్ణ ఘట్టమనేని అలాగే రాషా తడాని కలయికలో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ అనే చెప్పొచ్చు. ఈ చిత్రం రిలీజ్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఆ మధ్య ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపించాయి.
ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు రావచ్చనే టాక్ వినిపించింది. దీనితో ‘వారణాసి’ షూట్ లో బిజీగా ఉన్న మహేష్ ఎట్టకేలకి చాలా కాలం తర్వాత ఓ ఈవెంట్ లో కనిపించనున్నారు అని ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం మహేష్ ఈ ఈవెంట్ కి హాజరు కావడం లేదు అనే తెలుస్తుంది. ఇది నిజం అయితే మాత్రం ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


